AP Board :X Telugu:అంపకాలు
అంపకాలు
పాఠ్యభాగం |
|
ప్రక్రియ: గల్పిక పరిమాణంలో కథానిక
కంటే చిన్నది. విమర్శ ఇందులో ప్రధానం. ఒక వ్యక్తి అనుభవంలో ఒక దశ లేదా ఒక
సంస్థ పరిణామక్రమంలోని ఒక విశేషం గల్పికలో వస్తువు. గల్పికలో అనుభూతి చిత్రణ కంటే అనుభవ ప్రకటనకు
భావదృష్టికీ రచయితలు ప్రాముఖ్యం
ఇస్తారు.
పాత్రలు - స్వభావాలు
|
చిట్టి: చిట్టికి బాబాయి అంటే బాగా ఇష్టం. బాబాయి తనను విడిచి పెట్టి ఊరికి వెళుతున్నాడంటే ఎంతో బాధపడింది. బాబాయి ఎత్తుకుని బుజ్జుగిస్తున్న కొద్దీ మారాం చేసింది. తల్లిదండ్రులు బాబాయి చంకదిగమని కోప్పడితే బావురుమన్నది. చిన్నపిల్లల మనస్తత్వానికి చిట్టి ఒక నిదర్శనం.
చిట్టి బాబాయి: అంపకాలు పాఠంలో ఒక పాత్ర. చిట్టి తనపై చూపించిన ప్రేమను సందేహించాడు. అంతకుముందు చిట్టి ఇలాంటి ప్రేమను చూపించలేదని ఆశ్చర్యపోయాడు. ఏడుస్తున్న చిట్టిని బుజ్జగించి ఓదార్చిన దయా స్వభావం కలవాడు.
సందర్భవాక్యాలు
|
1. అతడికి ఈ ప్రేమను నమ్మాలో నమ్మరాదో తెలీలేదు.
పరిచయం: ఈ వాక్యం కొడవటిగంటి కుటుంబరావు రచించిన అంపకాలు అనే పాఠంలోది. సందర్భం: బాబాయి ఊరికి వెళుతుంటే చిట్టికి పట్టరాని దుఃఖం వచ్చింది. బాబాయి చంక ఎక్కి దిగకుండా మారాం చేసింది. |
2.
అందరూ ఒక్కసారిగా మాట్లాడుతున్నారు.
పరిచయం: ఈ వాక్యం కొడవటిగంటి కుటుంబరావు రచించిన అంపకాలు అనే పాఠంలోది.
సందర్భం: బాబాయి ఊరికి వెళ్లడానికి రైల్వేస్టేషన్‌కి వెళ్లాడు. ఆ రోజు మెయిలు ఏడుగంటల ఆలస్యంగా వస్తుందని తెలిసి మళ్లీ ఇంటికి వచ్చాడు. అప్పటికే చిట్టి నిద్ర పోతోంది. అయితే ఇంట్లో వాళ్లు మాట్లాడుతున్న అలికిడికి ఆమె మేలుకుంది. కానీ కళ్లు తెరవలేదంటూ రచయిత తెలియజేసే సందర్భంలోది.
వివరణ: బాబాయి రైల్వేస్టేషన్ నుంచి తిరిగి వచ్చిన తర్వాత ఇంట్లో వాళ్లంతా ఒక్కసారిగా మాట్లాడసాగారని ఆ అలికిడికి చిట్టికి మెలకువ వచ్చిందని భావం.